శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని,
కే అగ్రహారం, ముత్యాల గ్రామాల్లో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
జగ్గయ్యపేట, జూన్ 5 (యువ గళం న్యూస్): కే అగ్రహారం మరియు ముత్యాల గ్రామాల్లో విద్యుత్ మరమ్మత్తుల పనుల కారణంగా శనివారం (జూన్ 6) తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని, ఈ సమయంలో నిర్వహణ మరియు మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయా గ్రామాల విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ కోరింది.
విద్యుత్ సరఫరా నిలిపివేత కారణంగా ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ఈ విషయాన్ని జగ్గయ్యపేట విద్యుత్ శాఖ అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ వి. ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు.