నూతన పట్టు వస్త్రాలంకరణ వేడుకకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు

చిన్నారులను ఆశీర్వదించిన వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు
​వత్సవాయి, (ప్రతినిధి): జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం కాకరవాయి గ్రామానికి చెందిన ముళ్ళపాటి శేషగిరి - సుప్రియ దంపతుల కుమార్తె సౌమ్య కుమారుడు సాత్విక్ నూతన పట్టు వస్త్రాలంకరణ వేడుకకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులను కలిసి అక్షింతలు వేసి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షులు మార్కపూడి గాంధీ, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, గ్రామ పార్టీ అధ్యక్షులు రేళ్ళ రామకృష్ణ, పార్టీ నాయకులు బత్తినేని శ్రీనివాసరావు, కలక మురళీకృష్ణ, జంపాల వెంకటేశ్వర్లు, నెమలి ప్రభుదాసు, జక్కులూరి దేవదాస్, మర్కాపూడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.