ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత దేవినేని వెంకటరమణ ​దేవినేని రమణ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మాజీ మంత్రి దేవినేని ఉమా ​నందిగామ అభివృద్ధికి రమణ, తంగిరాల ప్రభాకర్ చేసిన సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే సౌమ్య

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత దేవినేని వెంకటరమణ....

​దేవినేని రమణ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మాజీ మంత్రి దేవినేని ఉమా..

​నందిగామ అభివృద్ధికి రమణ, తంగిరాల ప్రభాకర్ చేసిన సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే సౌమ్య

​కంచికచర్ల యువ గళం న్యూస్ : ప్రజల సమస్యల పరిష్కారానికి జీవితాంతం అంకితభావంతో పనిచేసి, నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజానేత స్వర్గీయ దేవినేని వెంకటరమణ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొనియాడారు.
​కంచికచర్ల మండల కేంద్రంలోని దేవినేని వెంకటరమణ ఘాట్ వద్ద ఆయన 27వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి రమణ ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవినేని రమణ స్మారకార్థం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి అంజలి ఘటించారు.

సూర్యచంద్రులు ఉన్నంతకాలం వారి పేరు నిలిచిపోతుంది: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ స్వర్గీయ దేవినేని వెంకటరమణ, స్వర్గీయ తంగిరాల ప్రభాకర్ రావు నందిగామ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివన్నారు. నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆ ఇద్దరు నేతలు అహర్నిశలు శ్రమించారని గుర్తుచేశారు. ఆకాశంలో సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఈ ఇద్దరు మహానేతలు నియోజకవర్గ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. రమణ చూపిన ప్రజా సేవా మార్గంలోనే తాము కూడా నడుస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన శ్రేణులు ఈ నివాళుల కార్యక్రమంలో మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, వివిధ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు మరియు దేవినేని రమణ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఘన నివాళులు అర్పించారు.