భాషలు ప్రజలను కలిపే వారధులు: మాజీ ఎమ్మెల్సీ తొండపు దశరథ జనార్దన్

భాషలు ప్రజలను కలిపే వారధులు: మాజీ ఎమ్మెల్సీ తొండపు దశరథ జనార్దన్

యువ గళం న్యూస్ :
​ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన “ఆవో ఉర్దూ సీఖో” కార్యక్రమంలో జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ మరియు జయప్రద ఫౌండేషన్ చైర్మన్ తొండపు దశరథ జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశం భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమని, దేశ సాహిత్య, సాంస్కృతిక రంగాలకు ఉర్దూ భాష విశేష సేవలు అందించిందని కొనియాడారు. భాషల పరిరక్షణ మరియు అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ఆయన, “ఆవో ఉర్దూ సీఖో” వంటి కార్యక్రమాలు కేవలం భాషా అభ్యాసాన్ని ప్రోత్సహించడమే కాకుండా వివిధ వర్గాల మధ్య సాంస్కృతిక సామరస్యాన్ని పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు; అలాగే యువతలో ఉర్దూ భాషను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఉర్దూ అకాడమీ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని, భాషలు ప్రజలను కలిపే వారధులని, ప్రతి భాషను గౌరవించి సంరక్షించాల్సిన అవసరం ఉందని దశరథ జనార్దన్ స్పష్టం చేశారు.