వత్సవాయి తాసిల్దార్‌గా జి. వెంకటేశ్వరరావు నియామకం... డిప్యూటీ తాసిల్దార్ నుండి పదోన్నతిపై బాధ్యతలు..

వత్సవాయి తాసిల్దార్‌గా జి. వెంకటేశ్వరరావు నియామకం....

డిప్యూటీ తాసిల్దార్ నుండి పదోన్నతిపై బాధ్యతలు..

వత్సవాయి యువ గళం న్యూస్:
​వత్సవాయి మండల నూతన తాసిల్దార్‌గా జి. వెంకటేశ్వరరావు (రాహుల్) నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వత్సవాయి మండలంలోనే డిప్యూటీ తాసిల్దార్‌ (డీటీ) గా సమర్థవంతంగా సేవలందించిన ఆయన, పదోన్నతి (Promotion) పొంది అదే మండలానికి తాసిల్దార్‌గా బాధ్యతలు చేపట్టనుండటం విశేషం. కాగా, తన విధి నిర్వహణలో నిరంతరం శ్రమిస్తూ, పని పట్ల అంకితభావంతో ముందుకు సాగే ఆయనను తోటి అధికారులు "పని రాక్షసుడు" అని కొనియాడతారు. రెవెన్యూ సమస్యలతో పాటు రైతుల అవసరాలు ఏ సమయంలో వచ్చినా వెనుకాడకుండా, రాత్రి సమయాల్లోనైనా ఫీల్డ్‌కు వెళ్లి పరిశీలించి, పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన ఎనలేని కృషి చేశారు. ఈ క్రమంలోనే ఆయన అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా చేతుల మీదుగా ఆయన "ఉత్తమ తాసిల్దార్" అవార్డును కూడా అందుకున్నారు. స్థానిక పరిస్థితులపై పూర్తి పట్టుండటంతో పాటు ప్రతిష్టాత్మక అవార్డు గ్రహీత అయిన జి. వెంకటేశ్వరరావు నూతన తాసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరిస్తుండటం పట్ల నందిగామ డివిజన్ రెవెన్యూ అధికారులు, మండల సిబ్బంది మరియు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.