ధర్మవరప్పాడు తండాలో గ్రామస్తుల వినూత్న సంప్రదాయం యువ గళం న్యూస్ ఎడిటర్ : బుర్రి వెంకట్

ధర్మవరప్పాడు తండా గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని కోరుతూ గ్రామస్తులు వినూత్న రీతిలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామస్తులు, గ్రామ పెద్దలు కలిసి మేళతాళాలతో కప్పను ఊరేగించారు. అనంతరం వర్షాలు సమృద్ధిగా కురిసి గ్రామంలో పాడిపంటలు కళకళలాడాలని దేవుడిని ప్రార్థించారు.
వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి సకాలంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ గ్రామ పెద్దలు వేప ఆకులను నడుముకు కట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. మేళతాళాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కప్పను ఊరేగిస్తూ వర్షాలు కురవాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సకాలంలో వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నీటితో నిండాలని, రైతులు పంటలు సమృద్ధిగా పండించుకుని సుఖసంతోషాలతో ఉండాలని గ్రామ పెద్దలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.